భోంచేసి వస్తున్న వాణ్ణి చంపి,భోజనానికెళ్ళి చచ్చాడు...74 ఏళ్ల రాబర్ట్ ఆ రోజు కూతురి ఇంట్లో భోంచేసి తన గ్యారేజీకి పోతున్నాడు. అతణ్ణి చూసి స్టీవెన్స్ ఉత్సాహ పడ్డాడు. సెల్‌ఫోన్ తీసి కెమెరాలో ‘‘మనం చంపడానికి ఫైనల్‌గా ఒకడు దొరికాడబ్బా!’’ అని వెకిలినవ్వు నవ్వుకుని, రాబర్ట్‌ని ఆపాడు.
‘‘ఏదీ ఓసారి జాయ్లేన్ అనమ్మా కెమెరాలో!’’ అన్నాడు.‘‘ఎందుకనాలి? అదెవత్తి?’’ నిలదీశాడు రాబర్ట్.‘‘మన పిల్లే, దాని గురించే చంపాల్సి వచ్చింది నిన్ను!’’ అని చటుక్కున రివాల్వర్ తీసి రాబర్ట్ నుదుటికి పెట్టేశాడు స్టీవెన్స్. బిగుసుకుపోయాడు రాబర్ట్. ఇంకో వెకిలి నవ్వునవ్వి, కెమెరా ఫోకస్ చేసి ట్రిగ్గర్ నొక్కాడు స్టీవెన్స్. బుల్లెట్ దూసుకొచ్చి కుప్పకూలాడు రాబర్ట్. రక్తంతో తడిసిపోతున్న అతడి మొహం మీదికి కెమెరా తిప్పి, వీడియో తీసి, పరారయ్యాడు స్టీవెన్స్.అట్టుడికింది క్లీవ్‌లాండ్ పట్టణం ఈ ఘటనకి...పోలీస్ చీఫ్ విలియమ్స్ తక్షణం గాలింపు బృందాల్ని రంగంలోకి దింపాడు. కానీ ఎవర్ని గాలించాలో అర్ధంగాలేదు. చూసిన సాక్షులెవరూ లేరు.రెండు గంటల తర్వాత, ఫేస్బుక్లో ఒక వీడియో వైరల్ అయింది.
సంచలనం రేగింది. రాబర్ట్‌ని హంతకుడు షూట్ చేసి చంపుతున్న దృశ్యం, అంతకి ముందు మాట్లాడిన మాటలు!చూస్తే గర్ల్ ఫ్రెండ్‌తో చెడి, ఎవరో దారిని పోతున్న రాబర్ట్ మీద ప్రతాపం చూపాడని అర్ధమయింది. వెంటనే హంతకుడి సమాచారం కోసం 50 వేల డాలర్లు బహుమానం ప్రకటించాడు పోలీస్ చీఫ్. అదే సమయంలో పెన్సిల్వేనియా, న్యూయార్క్, మిచిగాన్, ఇండియానా ప్రాంతాల్లో ప్రజల్ని అప్రమత్తం చేశారు.గాలింపు బృందం స్టీవెన్స్ గర్ల్ ఫ్రెండ్ జాయ్లేన్ని పట్టుకుంది. ఆ వీడియో చూసి కాల్ చేస్తున్నా అతను రెస్పాండ్ అవడం లేదని చెప్పిందామె.‘‘ఎలా చెడింది మీకు?’’‘‘గాంబ్లింగ్ - వద్దంటే విన్పించుకోలేదు’’బృందం స్టీవెన్స్ తల్లిని కూడా పట్టుకుంది. అతను ఇంటికొచ్చి, నేనిక కన్పించనని చెప్పేసి వెళ్లిపోయాడని అందామె.‘‘ఎక్కడి కెళ్ళాడు?’’‘‘ఏమో -ఇందాక కాల్ చేస్తే... జాయ్ కట్ చేసింది నన్ను, పిచ్చెక్కుతోంది నాకు, ఇంకొందర్నీ చంపాలి- అన్నాడు సర్’’ అంది స్టీవెన్స్ తల్లి.