పంట పండకపోయినా ఆత్మహత్య, ఉద్యోగ బాధ్యతల్లో ఒత్తిడి పెరిగినా ఆత్మహత్య, ప్రేమ విఫలమైనా ఆత్మహత్య... ఆధునిక సమాజం ఎటుపోతోంది? ఇలాంటి సున్నిత అంశాలను ప్రస్తావిస్తూ తనదైన శైలిలో నవలను నడిపించారు రచయిత సింహప్రసాద్‌. తనకోసమే కాక ఎదుటివారికోసం కూడా కొంత సమయాన్ని కేటాయించాలని చెప్పకనే చెబుతున్నారు. నవల ప్రారంభమే అనూహ్యంగా ఓ ఫోన మెసేజ్‌తో ప్రారంభమవటం... పాఠకుల్లో ఉత్సుకత కలిగిస్తుంది. ఒక ప్రేమ జంట భవిష్యత్తు కోసం పడే ఆరాటం ఈ నవల్లో కనిపిస్తుంది. ఆద్యంతం సస్పెన్సతో సాగే నవల ఇది. 
 
 
- లక్ష్మీ నర్మద
 
 
నిండునూరేళ్లు (నవల) 
రచయిత: సింహప్రసాద్‌ 
పేజీలు: 200 
వెల: 140/- 
ప్రతులకు: శ్రీశ్రీ ప్రచురణలు 
401, మయూరి ఎస్టేట్స్‌, మిగ్‌- 11/650, కెపీహెచబీ, హైదరాబాద్‌ - 500085. 
సెల్‌: 98490 61668 
మరియు అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు.