సహృదయ దుబాసీ
కొల్లూరి సోమశంకర్ తెలుగు పాఠకులకే కాదు, వివిధ భాషల్లోని పాఠకులకూ చిరపరిచితులు. ఎవరెవరో రాసిన కథలను ఎంపిక చేసుకుని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు. అంతేకాదు, మన తెలుగు భాషలోని మంచి కథలను హిందీలోకి అనువదిస్తున్నారు. ఈ సహృదయతే ఆయన కథల అనువాదంలోనూ కనబడుతుంది. ఈ సంపుటిలోని కథలను చదివితే ఎక్కడా అనువాదమని అనిపించవు. మూల కథ ఆంగ్లమైనా, బెంగాలీ అయినా, ఉర్దూ అయినా... తెలుగు కథంత సరళంగా ఆయన అనువాదం సాగింది. ‘అమృతవర్షణి’, ‘బేరం’, ‘వాళ్లిద్దరూ, ఆటోడ్రైవర్’ వంటి కథలు సున్నితంగా హృదయాలను తాకుతాయి. విషయ సూచికలో కథ పేరుతో పాటు భాష, ఆ భాష రచయిత పేరు ఇస్తే బావుండేది. ఎందుకంటే, ఆయా భాషల పట్ల అభిమానం ఉన్నవారు ఆయా కథలను తొలుత చదవడానికి ఇష్టపడతారు కాబట్టి.
- దేరా
నాన్నా తొందరగా వచ్చేయ్, కొల్లూరి సోమశంకర్
పేజీలు : 66, వెల : రూ.80
ప్రతులకు : ప్రముఖ పుస్తక దుకాణాలు