ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పనిగట్టుకుని వందలాది పేజీల పుస్తకం చదవడం కుదిరే పని కాదు. తీరా చదివాక పుస్తకం నచ్చకపోతే కాలం వృథా చేసుకున్నామనే చిరాకు. ఇలాంటివి దరి చేరకుండా వందలాది పుస్తకాలు వడబోసి 68 నవలల్ని ఎంచి వాటి సారాన్ని క్లుప్తంగా నాలుగు పేజీల్లో చెప్పారు రచయిత. జ్ఞానపీఠ అవార్డు పొందిన ‘పాకుడురాళ్లు’, దళిత అస్తిత్వాన్ని చాటిన ‘అంటరాని వసంతం’తో పాటు ఊబిలో దున్న, అవతలి గట్టు, మోహనవంశి ... అన్నీ మంచి పుస్తకాలే. ఒకమాటలో చెప్పాలంటే, పూర్తి నవల చదవాలనే ఆసక్తిని కలగచేసే పరిచయాలివి.
- గొరుసు
నవలా హృదయం - 2
వి. రాజారామమోహనరావు
పేజీలు : 407, వెల: రూ. 290
ప్రతులకు : 90004 13413